కాళేశ్వరం పుష్కర ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కాళేశ్వరం పుష్కర ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

జయశంకర్ భూపాలపల్లి:కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పుష్కరాలు ప్రారంభమయ్యేందుకు మరో మూడు రోజులు మాత్రమే ఉంది..అన్ని పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.  

కుంభమేళా తరహాలో కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలను నిర్వహిస్తామన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రధాని మోదీ, అమిత్ షాకు పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్మానం పంపిస్తామన్నారు. మోదీ తప్పకుండా కాలేశ్వరం వచ్చి సరస్వతి పుష్కరాల్లో త్రివేణి సంఘంలో పుణ్యస్నానాలు ఆచరించాలని కోరుతున్నామన్నారు. 

యూపీలో మహాకుంభమేళా కు రావాలని కొందరు సీఎం రేవంత్ రెడ్డిని కోరితే తెలంగాణలోనే అత్యంత వైభవంగా పుష్కరాలు జరుగుతాయని దానికి ప్రధానమంత్రికి ఆహ్వానం పంపుతామని తెలిపారని ఎంపీ వంశీ గుర్తుకు చేశారు.