సింగరేణి కార్మికుడికి ఎంపీ వంశీకృష్ణ పరామర్శ

సింగరేణి కార్మికుడికి ఎంపీ వంశీకృష్ణ పరామర్శ

కరీంనగర్, వెలుగు: గని ప్రమాదంలో గాయపడిన సింగరేణి కార్మికుడిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. గోదావరిఖని 11 ఇంక్లైన్ గనిలో జరిగిన ప్రమాదంలో సురేశ్‌‌‌‌‌‌‌‌ అనే కార్మికుడు గాయపడగా చికిత్స కోసం ఆయనను కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రెనీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చేర్పించారు. ఎంపీ బుధవారం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు చేరుకుని కార్మి కుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ బంగారు స్వామితో మాట్లాడి ప్రస్తుతం అందుతున్న ట్రీట్ మెంట్ వివరాలను తెలుసుకున్నారు. 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శాలువతో సన్మానించారు. పెద్దపల్లి పట్టణంలోని ఒక చిన్న టీ షాప్‌‌‌‌‌‌‌‌ వద్దకు బుధవారం ఎంపీ వెళ్లారు.  కట్టెల పొయ్యి,  గ్యాస్ పొయ్యి ఉపయోగించకుండా ఎలక్ట్రిక్ పొయ్యితో టీ తయారు చేస్తూ కాలుష్యాన్ని తగ్గించే విధంగా జీవనం సాగిస్తున్న ఆమెను అభినందించారు. గ్యాస్ కొరత  ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, పొగరహిత విధానాన్ని ఎంచుకుని పర్యావరణాన్ని కాపాడుతున్న తీరుకు ఆమెను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి సెల్ఫీ కూడా దిగారు.