
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు పెద్దపల్లి ఆర్డీవో. రామగుండం కార్పోరేషన్ ఇంచార్జీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నాడు శంకర్ కుమార్. గోదావరిఖని కి చెందిన రజినీకాంత్ అనే కాంట్రాక్టర్ తనకు రావాల్సిన బిల్లుల కోసం ఆర్డీవో ఆఫీసుకు వెళ్లాడు. బిల్లులు రావాలంటే లంచం ఇవ్వాల్సిందిగా శంకర్ కుమార్ డిమాండ్ చేశాడు. దీంతో రజినీకాంత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రజినీ కాంత్ నుంచి పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు శంకర్ కుమార్.