పాపను కాపాడండి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

పాపను కాపాడండి..  ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

లింగంపేట, వెలుగు : మండలంలోని పోతాయిపల్లి గ్రామానికి చెందిన సంగాగౌడ్‌‌‌‌, లావణ్యల ఏడేళ్ల కుమార్తె ఆద్విక ప్రాణాపాయ స్థితిలో వెంటిలేషన్‌‌‌‌పై చికిత్స పొందుతోంది. ఇప్పటికే రూ.10లక్షలు ఖర్చు అయ్యింది. ఇంకా తమకు ఆర్థిక స్థోమతలేదని దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు.

లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధి తమ పాపను వచ్చిందని దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు.  దాతలు 9948732493 నంబర్‌‌‌‌కు ఫోన్​పే, గుగుల్​పే ద్వారా సాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు. లింగంపేట గ్రామానికి చెందిన రాష్ట్ర హైకోర్టు లాయర్ మోహిన్ అహ్మద్‌‌‌‌ ఖాద్రి రూ.25వేల సాయం అందించారు.