కర్కాటక రాశి వారికి ఈ నెల ( ఆగస్టు 2026) కొత్త అవకాశాల పండుగగా మారనుంది. అన్ని రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి గ్రహాల సంచారం తోడుగా ఉండే అవకాశం ఉంది. జ్యోతిష్య నిపుణులు తెలిపి న వివరాల ప్రకారం 2026 వ సంవత్సరం ఆగస్టు నెలలో ఈ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం...
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెల ( 2026 ఆగస్టు)లో గురుడు.. కర్కాటక రాశిలో లగ్నంలోకి ప్రవేశించనున్నాడు. దీని విలన ఈ రాశి వారి జీవితం స్వర్ణమయంగా మారుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. . ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు
ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. కొత్త ఉత్సాహంతో చేపట్టిన పనులు కొనసాగిస్తారు. ఉద్యోగంలో అడ్డంకులు, అసంతృప్తి తొలగిపోతాయి. మీరు మీ రుణాలన్నీ తీర్చేస్తారు. పని ప్రదేశంలో మీ తెలివితేటలను, వివేకాన్ని అందరూ మెచ్చుకుంటారు. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. అంతేకాకుండా పని ఒత్తిడి తగ్గి, సహోద్యోగులతో కలిసికట్టుగా పనిచేసే మీ వైఖరి ప్రశంసలు అందుకుంటుంది
వ్యాపారస్తులకు భారీ పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది.
శుభ గ్రహాలన్నీ దాదాపు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల నెలంతా బాగా అనుకూలంగా, సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషం వెల్లివిరుస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. గతంలో తీసుకున్న రుణాలను తీర్చేస్తారు.. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. .సర్వత్రా మీ ప్రాధాన్యం పెరుగుతుంది. మీ మాటకు విలువ ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కుటుంబ జీవితం అనుకూలంగా సాగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పండితులు చెబుతున్నారు.
పరిహారం: మంగళవారం హనుమంతునికి ఆకుపూజ.. ఆంజనేయస్వామికి వడలు.. అప్పాలు సమర్పణ. .పేదలకు అన్నదానం
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
