యాదాద్రి, వెలుగు: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఇందుకోసం 50 రోజుల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన హైస్కూల్ హెడ్మాస్టర్ల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్కూల్స్‌లో పదో తరగతి చదువుతున్న 5063 మంది స్టూడెంట్స్ అందరూ పాస్ కావాలన్నారు. మంచి మార్కులు సాధించిన 200 మంది స్టూడెంట్స్కు సైకిళ్లు ఇస్తామని తెలిపారు. ఎన్నికలు, సంక్రాంతి సెలవుల కారణంగా స్కూల్స్‌కు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
ఈ కారణంగా స్టడీ విషయంలో స్టూడెంట్స్కు ఇబ్బంది కలుగుతుందన్నారు. మంచి ఫలితాలతో స్టూడెంట్స్సంఖ్య పెరుగుతుందని, అందరూ ఆ దిశగా ముందుకు సాగాలని సూచించారు. అడిషనల్కలెక్టర్ ఏ భాస్కరరావు, డీఈవో కే సత్యనారాయణ, డీఆర్డీవో నాగిరెడ్డి, డీపీవో విష్ణువర్దన్ రెడ్డి, ఏడీ ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.
