- కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, వెలుగు: విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా సామర్థ్యాలను టీచర్లు, తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలని నిర్మల్కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. వూషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 24 నుంచి 30 వరకు ఛత్తీస్ గఢ్లో నిర్వహించిన వుషూ ఫెడరేషన్ కప్ క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన స్టూడెంట్లు నర్వాడే రుద్ర, అబ్దుల్ రెహ్మాన్, గోరా అనన్య కాంస్య పతకాలు సాధించారు.
కాగా వారిని శుక్రవారం కలెక్టర్కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అభినందించారు. వారికి పతకాలు అందించారు. భవిష్యత్లో మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
