టెన్త్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి : ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌

టెన్త్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి : ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌

గుడిహత్నూర్, వెలుగు: ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ టెన్త్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌ స్టూడెంట్లకు సూచించారు. శుక్రవారం గుడిహత్నూర్‌ మండలంలోని ఉమ్రి గిరిజన బాలికల ఆశ్రమ స్కూల్​ను తనిఖీ చేశారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున విద్యార్థుల ఆరోగ్యం పట్ల టీచర్లు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 

టెన్త్​లో 10/10 జీపీఏ సాధిస్తే ఐఐటీ, జేఈఈ, నీట్‌వంటి ప్రతిష్టాత్మక కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. స్పెషల్ ​క్లాసులు  నిర్వహిస్తూ, గత ప్రశ్నపత్రాలను విద్యార్థులతో సాధన చేయించాలని టీచర్లను ఆదేశించారు.  అంతకుముందు పాఠశాలలోని స్టాక్‌రూమ్, డైట్‌మెనూ, కంప్యూటర్‌ ల్యాబ్, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. హెచ్‌ఎం భోజన్న సిబ్బంది ఉన్నారు.