యాదాద్రి, వెలుగు: తెలంగాణ గెజిటెడ్ అధికారుల రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్‌గా యాదాద్రి జిల్లాకు చెందిన మందడి ఉపేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 30 ఏండ్లుగా స్టేట్లెవల్లో ఉద్యోగ సంఘాల బాధ్యుడిగా వ్యవహరించారు.
ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు సమస్యలను పరిష్కరించడంలో చురుగ్గా వ్యవహరించారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఉపేందర్‌రెడ్డిని ఆర్డీవో కృష్ణారెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు సీహెచ్ జగన్ మోహన్ ప్రసాద్, టీఎన్జీవో అధ్యక్షుడు భగత్, ఖదీర్, కంచనపల్లి శ్రీకాంత్, పి. రామారావు, ప్రియాంక, మేఘలత, ఎం. కృష్ణ అభినందించారు.
