- భూమి కేటాయింపు ప్రతిపాదనల ఆధారంగానే విద్యాసంస్థల కేటాయింపు
న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ప్రస్తుతం జవహర్ నవోదయ విద్యాలయాలు లేవని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. నవోదయ విద్యాలయం లేని జిల్లాల్లో కొత్తవి ఏర్పాటు చేయడం.. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత భూమి, తాత్కాలిక భవన సదుపాయాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం లోక్ సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలోని 16 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు మంజూరు అయినట్లు తెలిపారు. ఇందులో 15 పనిచేస్తున్నాయని వెల్లడించారు.
