జగిత్యాల: బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ది లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. కుల, మతాలను అడ్డం పెట్టుకొని రాజు కీయాలు చేసే పార్టీని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లపల్లి మండలం చిల్వ కోడూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో విశాక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో బెంచీల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాని కి హాజరైన ఆయన మాట్లాడుతూ.. స్కూల్లో బెంచీలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సమాచారం అందడంతో వెంటనే స్పందించి ట్రస్ట్ ద్వారా బెంచీలు అందించామన్నారు.
త్రాగునీరు, టాయిలెట్స్, ప్రహరీ గోడ వంటి మౌలిక వసతుల కోసం ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద పల్లి పరిధిలోని ఏ స్కూల్కు సమస్య వచ్చినా సహాయం చేస్తానన్నారు. అనంతరం సమీప అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి పిల్లలకు పౌ ష్టికాహారం సరిగా అందుతున్నదా లేదా అని బ్బందిని అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇదే స్కూల్కు మరో 50 బెంచీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేసి గద్దెను దక్కించుకుంటున్న బీజేపీ.. బీసీ రిజర్వే షన్ల విషయంలో స్పష్టత ఇవ్వకుండా మోసం చేస్తుందన్నారు.
