Ram Charan: 'కల్కి', 'పుష్ప 2' క్లబ్‌లోకి చేసిన 'పెద్ది'.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే?

Ram Charan: 'కల్కి', 'పుష్ప 2' క్లబ్‌లోకి చేసిన 'పెద్ది'.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే?

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన పవర్‌ను చూపిస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కేవలం నాలుగు రోజుల్లోనే  ఏకంగా రూ. 292.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి, రూ. 300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.

 'కల్కి', 'పుష్ప 2 సరసన చరణ్..

గురువారం గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. తొలి రోజు ఈ సినిమాను  భారీ కలెక్షన్లు వచ్చాయి, ఆ తర్వాత తగ్గాయి. అయితే ఈ వారం పెద్దగా సినిమా రిలీజ్ లు లేకపోవడం ' పెద్ది'కి కలిసి వచ్చింది. ఈ చిత్రానికి శుక్ర, శనివారాల కంటే ఆదివారం వసూళ్లు పెరిగాయి. నాలుగో రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి ఏకంగా రూ. 20 కోట్లకు పైగా షేర్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 

ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఈ ఫీట్ సాధించింది కేవలం 'కల్కి 2898 AD', 'పుష్ప 2' చిత్రాలు మాత్రమే. ఇప్పుడు ఆ ఎలైట్ క్లబ్‌లోకి రామ్ చరణ్ కూడా మాస్ ఎంట్రీ ఇచ్చాడు.  కానీ 'పుష్ప 2' నాలుగు రోజుల్లో రూ 800 కోట్లకు పైగా రాబట్టింది. ఇక 'కల్కి 2898 AD'  నాలుగు రోజుల్లో రూ.500 కోట్లు వసూళ్లు చేసింది. అయితే నాలుగు రోజుల్లో రూ.300 కోట్లు కలెక్షన్స్ 'పెద్ది' వసూళ్లు చేసినా .. 'కల్కి 2898 AD', 'పుష్ప 2' స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయిందన్న విమర్ళలు వస్తున్నాయి.

 

సాలిడ్ కాస్టింగ్..
రామ్ చరణ్ ఊరమాస్ లుక్, నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. వీటన్నింటికీ తోడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్  పాత్ర, చూపించిన విధానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.  దర్శకుడిపై మహిళలు, ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. దీంతో సతీష్ బాబు సన జాన్వీ పాత్రపై వివరణ ఇస్తూ.. ప్రేక్షకులను క్షమాపణ చెప్పారు.   కానీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'పెద్ది'కి పోటీగా మరే పెద్ద సినిమా లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. వీక్‌డేస్‌లో కూడా ఇదే జోరు కొనసాగితే, ఈ వీకెండ్ కల్లా 'పెద్ది' మరెన్నో సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.