Peddi Pre Release Event: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi). వరుస ఇంటర్వ్యూలు, ప్రమోషన్లతో మైండ్ బ్లోయింగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ రికార్డులతో సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. క్రికెటర్, అథ్లెట్, రెజ్లర్‌గా చరణ్ చూపించిన విశ్వరూపానికి, బుచ్చిబాబు సానా టేకింగ్‌కు, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేస్తుంది. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, ఇవాళ సోమవారం జూన్ 1న పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
విజయవాడలోని ప్రతిష్టాత్మక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈవెంట్‌ను జరుపుతున్నారు మేకర్స్. సాయంత్రం 5 గంటలకు షురూ కానున్న ఈ వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 25 వేల మందికి పైగా అభిమానులు హాజరయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ఈ ఈవెంట్‌కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
Vijayawada, your love and energy have been Truly Phenomenal. ❤️🔥
— PEDDI (@PeddiMovieOffl) May 31, 2026
The #PEDDI Festival has just begun... 🔥 https://t.co/nRZjYKAKdZ
ఈ మెగా వేడుకకు చీఫ్ గెస్ట్‌లుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరవుతారనే ప్రచారం చాలా రోజులుగా వినిపిస్తున్నప్పటికీ.. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం లేదు. కానీ, పవన్ కల్యాణ్ వీలును బట్టే విజయవాడలో ప్రీ- రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. అందువల్ల అప్డేట్ లేకపోయిన పవన్ ఫిక్స్ అని తెలుస్తోంది.
ఇదే సమయంలో మరో క్రేజీ వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. కానీ, వృద్ధి సినిమాస్ అధినేత, నిర్మాత వెంకట సతీష్ కిలారు గెస్ట్ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.
అయితే ఇండస్ట్రీ టాక్ ప్రకారం బాలయ్య రావడం దాదాపు ఖాయమేనని అంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. బాలయ్య రాక వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.
Your feed will be #PEDDIfied from today ❤️🔥 We're officially in the #PEDDI Week 💥💥#Peddi ROAR FROM VIJAYAWADA - Grand pre-release event today from 5 PM onwards at Indira Gandhi Stadium, Vijayawada ❤🔥
— PEDDI (@PeddiMovieOffl) June 1, 2026
▶️ https://t.co/6hR6LQ0JIP#PEDDI pic.twitter.com/Rcw6QEsaFr
‘పెద్ది’ చిత్రాన్ని నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్ (Vriddhi Cinemas) బ్యానర్‌లోనే బాలకృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు.. ఈ కనెక్షన్‌తోనే బాలయ్య ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే, మెగా-నందమూరి అభిమానులకు డబుల్ ట్రీట్‌గా మారనుంది. ఏదేమైనా ఒకే వేదికపై రామ్ చరణ్, బాలకృష్ణ కనిపించే అవకాశం ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
చిరు రాకపోవడానికి కారణం ఇదేనా..?
చిరంజీవి రాకపోవడానికి కారణం తన బిజీ షెడ్యూలే. ప్రస్తుతం బాబీ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఇవాళ సోమవారం నుంచి పొల్లాచ్చిలో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేస్తున్నట్లు టాక్. దాదాపు రెండు వారాలకు పైగా సాగే ఈ షెడ్యూల్‌లో చిరుపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు సమాచారం. అందువల్ల పెద్ది ఈవెంట్కు చిరు రావడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సక్సెస్ మీట్లో చిరు మెరిసే ఛాన్స్ లేకపోలేదు.
కనుకే, చిరంజీవి బదులుగా బాలయ్య బాబు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పెద్ది గెస్టులుగా పవన్, బాలయ్య అలోమోస్ట్ ఫిక్స్ అనేది ఇండస్ట్రీ వర్గాల బలంగా టాక్. అయితే ఈ ఊహాగానాలకు తెరపడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ‘పెద్ది’ టీమ్ మెయింటైన్ చేస్తున్న సస్పెన్స్‌కు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
