పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ అశోక్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ అశోక్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     ఎస్పీ అశోక్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జగిత్యాల టౌన్, వెలుగు: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జిల్లా పోలీస్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇయర్లీ క్రైమ్ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. గత ఏడాది పోలీస్ స్టేషన్ల పనితీరుపై రివ్యూ చేశారు. 2024తో పోలిస్తే 2025లో నేరాలు తగ్గాయని, గ్రేవ్ కేసులను నియంత్రించిన అధికారులను అభినందించారు. డీఎస్పీలు, సీఐలు తమ పరిధిలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసి, దర్యాప్తులపై సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ స్పష్టం చేశారు. 

బాధితులకు వెంటనే న్యాయం లభించేలా దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. సమావేశంలో డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐలు, డీసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.