పెరిగిన పింఛన్‌ వచ్చేదెప్పుడో?

పెరిగిన పింఛన్‌ వచ్చేదెప్పుడో?

పెంచిన ఆసరా పెన్షన్ల పంపిణీకి లోక్‌‌సభ ఎన్నికల కోడ్ అడ్డంకి గా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అందిస్తామని సీఎం కేసీఆర్‌‌ ప్రకటించినా కోడ్‌‌ వల్ల కుదరకపోవచ్చని అధికారులంటున్నారు. మే 23న లోక్‌‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.అయితే ఎన్నికల ప్రకియ మొత్తం ముగిసేదాకా..అంటే మే 28 వరకు కోడ్‌‌ అమల్లోనే ఉంటుందనిఈసీ ప్రకటించింది. దీంతో జూన్ నుంచి పెరిగిన పెన్షన్‌‌ను లబ్ధిదారులకు అందచేసే అవకాశాలున్నాయి. వికలాంగుల పెన్షన్ ను రూ.1,500 నుంచి రూ.3,016కు, ఇతరులకు ఇచ్చే పెన్షన్ వెయ్యి నుంచి రూ.2,016కు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్‌‌ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే పెన్షన్లు అందుకునే వారి వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించుతున్నట్లు తెలిపారు.ఏప్రిల్ 1 నుంచి పెంచిన పెన్షన్లను అందిస్తామన్నారు.అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జనవరిలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దీంతో ఆ నెల మొత్తం ఎన్నికల కోడ్ కొనసాగింది. ఇక ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలతో కొన్నిజిల్లాల్లో కోడ్ కొనసాగింది. ఈ నెల10న లోక్ సభఎన్నికల నోటి ఫికేషన్ వచ్చింది. దీంతో లబ్ధిదారుల ఎంపిక ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు.‘‘ఏప్రిల్ పెన్షన్లు మే లో ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్11న ఎన్నికలు పూర్తవుతున్నందున మేలో కొత్త పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎన్నికల సంఘం అనుమతికోరాలని భావిస్తున్నాం. ఒకవేళ అనుమతి రాకుంటేపెంచి న పెన్షన్లు జూన్ నుంచి ఇచ్చే అవకాశం ఉంది’’అని అధికారి తెలిపారు.8 లక్షల కొత్త లబ్ధిదారులు పెంచిన పెన్షన్లు అందుకునే వారు సుమారు 8 లక్షలమంది ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 39 లక్షల 64 వేల 433 మందికి పెన్షన్లు ఇస్తున్నారు. ఇందుకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. పెరిగిన లబ్ధిదారులు, పెంచిన పెన్షన్‌‌తో ఆసరాకురూ.10 వేల కోట్లు ఖర్చవనున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్ లో ఆసరా పెన్షన్లకు రూ.12వేల 67 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.