ముషీరాబాద్, వెలుగు: రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లకుంట లోని పెన్షనర్స్ అసోసియేషన్ స్టేట్ ఆఫీస్లో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో ఆవేదనకు గురై 24 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని గుర్తు చేశారు.
వయసు మీద పడి అనారోగ్యాలతో దవాఖానలో చేరుతున్నారని వాపోయారు. సీఎం రేవంత్రెడ్డి చొరవ తీసుకొని బెనిఫిట్స్ చెల్లించేలా కృషి చేయాలని కోరారు. లేదంటే 27న నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు వెలిశోజు రమా మనోహర్, బి.నర్సయ్య, రహమాన్ షా, సూర్యనారాయణ, మనోహర్ పాల్గొన్నారు.
