పోలవరం అవినీతి : పిటిషన్ స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు

పోలవరం అవినీతి : పిటిషన్ స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు

పోలవరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టులో జనసేన నేత పెంటపాటి పుల్లారావు పిటిషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులే మళ్ళీ కొత్త ప్రభుత్వం లో భాద్యతలు నిరవర్తిస్తున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రాజెక్ట్  అంచనాలు పెంచారని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేశారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో పిటీషన్ దాఖలు చేసినట్లు సూచించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లో అవినీతి జరుగుతుందంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లో జరిగిన అవినీతి అక్రమాలకు భాద్యులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా పుల్లారావు పిటిషన్ పై స్పందించిన ఢిల్లీ హైకోర్ట్  ఫిర్యాదుగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కేంద్ర జలవనరుల శాఖ కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది