దొరలపై ప్రజలు గెలవబోతున్నారు : రాహుల్, ప్రియాంక ట్వీట్స్

దొరలపై ప్రజలు గెలవబోతున్నారు : రాహుల్, ప్రియాంక ట్వీట్స్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికరమై ట్వీట్ చేశారు. నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారంటూ గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. తెలంగాణ సోదర సోదరీమణులారా.. రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండని, కాంగ్రెస్ ను గెలిపించండని ఎక్స్ వేదికగా కోరారు.

ఇదే తరహాలో ప్రియాంక  గాంధీ వాద్రా తన అభిప్రాయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఓటు వేయడం అందరి హక్కని, అది అతిపెద్ద బాధ్యత అని ఆమె గుర్తు చేశారు. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండని తెలిపారు.