9 ఏండ్లయినా ఇవ్వలేదు .. డబుల్ ఇండ్లు ఎప్పుడిస్తరు..?

   9 ఏండ్లయినా ఇవ్వలేదు .. డబుల్ ఇండ్లు ఎప్పుడిస్తరు..?
  •     మంత్రి మల్లారెడ్డి పర్యటనలో జనం ఆగ్రహం

శామీర్ పేట వెలుగు : ‘ఎన్నికలప్పుడు వచ్చి హామీలిచ్చి పోవడం తప్ప.. మళ్లీ ఇటువైపు కన్నెత్తి చూడడు మంత్రి మల్లారెడ్డి. మా ఓట్లు కావాలి. కానీ మా సమస్యలు మంత్రికి పట్టవా..’అని ప్రశ్నిస్తూ.. ఇప్పుడైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పించాలని తూంకుంట, శామీర్ పేట గ్రామాల ప్రజలు అధికార బీఆర్ఎస్ లీడర్లను నిలదీశారు. పెద్దమ్మ కాలనీలో ప్లాట్స్ ఇస్తున్నారని మంత్రి  మల్లారెడ్డి తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మంత్రి మల్లారెడ్డి పర్యటనలో భాగంగా తూంకుంట,శామీర్ పేట ప్రాంతాల్లో లైబ్రరీ భవన నిర్మాణాల శంకుస్థాపనకు వచ్చారు.

మంత్రికి గ్రామస్తులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తుండగా అధికార పార్టీ లీడర్లు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరయాంజల్​లో గ్రామస్తులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వచ్చాయని పేపర్లు చూపించి.. మళ్లీ పేపర్స్ తీసుకెళ్లిన అధికారులు ఇప్పటివరకు ఇవ్వలేదని, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే వాటిని కూల్చివేశారని, దేవాదాయ శాఖ భూముల్లో అక్రమ నిర్మాణాలు కట్టుకుంటే మంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇల్లు కట్టుకోవడానికి  జాగా అయినా చూపించాలని కోరారు.