కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది : బండి సంజయ్

కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది : బండి సంజయ్

సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా పాలనను గాలికొదిలేసి నియంతపాలన చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని భావిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని అన్న సంజయ్... 119 నియోజకవర్గలాలో తమ పార్టీకి పోటీ ఉందన్నారు. కార్నర్ మీటింగులు పెట్టడంతో స్థానిక ప్రజలకు బీజేపీ పట్ల నమ్మకం ఏర్పడిందని తెలిపారు. ఉచిత విద్య,వైద్యంతో పాటుగా కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్నర్ మీటింగ్స్ లో ప్రజలకు చెప్తున్నామన్నారు. బీజేపీలో కష్టపడి,ఇష్టపడి పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు.