భవిష్యవాణి: ఈ ఏడాది వానలతో ఇబ్బందులు

V6 Velugu Posted on Jul 26, 2021

సికింద్రాబాద్ : ఈ ఏడాది వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు అమ్మవారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా భవిష్యవాణి వినిపించింది స్వర్ణలత. మహమ్మారి ఇబ్బంది పెట్టినా జనం నన్ను నమ్మినందుకు సంతోషంగా ఉందన్నారు అమ్మావారు. భక్తులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే భారం తనదేనని తెలిపారు. అమ్మకు ఇంత చేసినా తమకేమి చేయలేదన్న భావన వీడాలన్నారు. ప్రజల కష్టాల్లో తాను భాగం పంచుకుంటానని తెలిపారు అమ్మవారు.
అంతకు ముందు... స్వర్ణలతకు చీర, ఒడిబియ్యం సమర్పించారు అధికారులు. భవిష్యవాణి కార్యక్రమం ముగియటంతో  అంబారీపై అమ్మవారి ఊరేగింపు, పోతరాజుల గావు కార్యక్రమం జరగనుంది. మరోవైపు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు.

 

Tagged Telangana, Rains, swarnalatha, ujjaini mahankali bonalu, , Rangam Bhavishyavani 2021

Latest Videos

Subscribe Now

More News