భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాల ప్రజల ఇక్కట్లు

భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాల ప్రజల ఇక్కట్లు

భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాల్లో  బీభత్సం సృష్టిస్తున్నాయి.  రాజస్థాన్ లో వారం రోజులు నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల జోధ్ పూర్ సిటీలోని ఓ పురాతన భవనం కుప్పకూలింది.

మధ్యప్రదేశ్ లో రెండు-మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో షాజాపూర్ సిటీ మొత్తం వరద గుప్పిట్లో చిక్కుకుంది. వరదల తాకిడికి మొసళ్లు ఊళ్లలోకి వస్తున్నాయి. దామోహ్ జిల్లాలోని ఘాట్ పిపారియా గ్రామంలో ఊళ్లోకి వచ్చిన భారీ మొసలిని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.

అస్సాంలో వర్షాలు కాస్త తెరిపినిచ్చినా వరద మాత్రం ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ రాష్ట్రంలోని 18 జిల్లాలు వరదలోనే ఉన్నాయి. 17వందల 16గ్రామాలు, 56 రెవెన్యూ సర్కిళ్లలో వరద పరిస్థితులు ఉన్నాయని అస్సాం విపత్తు నిర్వహణా సంస్థ తెలిపింది. మొత్తం 21లక్షలకు పైగా ప్రజలపై వరద ప్రభావం ఉన్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 12 జిల్లాల్లో 615 రిలీఫ్ క్యాంప్ లు యాక్టివ్ గా ఉన్నాయి. దాదాపు లక్షకు పైగా జనం రిలీఫ్ క్యాంప్ లలో తలదాచుకుంటున్నారు