రోడ్డు కరాబ్ చేస్తున్నరని అడ్డంగా తొవ్విర్రు

రోడ్డు కరాబ్ చేస్తున్నరని అడ్డంగా తొవ్విర్రు

అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా తమకు ఆపతి వస్తే కనీసం అంబులెన్స్ సర్వీసులకు కూడా నోచుకోలేకపోతున్నామని ఓ కాలనీ వాసులు వినూత్న నిరసన తెలిపారు. అసలే గుంతల రోడ్డు ఆధికారులు, పాలకులు అసలే పట్టించుకోవడం లేదని.. కానీ కాలనీ రోడ్డు నుండి కొంతమంది బిల్డర్స్ కు చెందిన భారీ వాహనాలు తిరుగుతుండడంతో అసలే బాగలేని రోడ్డు గుంతల మయం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎక్కడో మారుమూల గ్రామంలో అస్సలే కాదు సిటీకి ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని పసుమాముల సాయి రెడ్డి కాలనీలో జరిగింది. 

గత కొంత కాలంగా భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు ధ్వసం అయ్యింది. దీంతో గతంలోనే రెండు సార్లు స్థానికులు స్వయంగా గుంతలు పూడ్చుకున్నారు. అయితే తిరిగి అదే సమస్య పుణరావృతం అవుతుండడంతో అధికారులకు, పాలకులకు ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. దీంతో కాలనీ వాసులు జేసీబీ సహాయంతో కలనీలోకి భారీ వాహనాలు రాకుండా రోడ్డుకు అడ్డంగా గుంత తొవ్వి ఆందోళనకు దిగి నిరసన తెలిపారు. గత 10 రోజుల క్రితం కాలనీలోకి దొంగలు వస్తే డైల్ 100 కు కాల్ చేస్తే రోడ్డు బాగలేదని పోలీసులు కూడా రాలేని పరిస్థితి ఉందన్నారు. కాలనీ వాసులు ఎంతో మంది బైక్ పై నుండి కింద పడి కుటుంబంతో సహా ఆస్పత్రుల పలు అయ్యారని తెలిపారు.