- రూ.2 వేల నోట్ల విత్‌డ్రా..ఆర్‌బీఐకి జనం సపోర్ట్
- 68 శాతం మంది మద్దతు బ్లాక్ మనీని కట్టడి చేయడానికేనని
- నమ్ముతున్న వారే ఎక్కువ
- తమ దగ్గర రూ. 2 వేల నోట్లు లేవన్న 64 శాతం మంది రెస్పాండెంట్లు
- వెల్లడించిన లోకల్ సర్కిల్స్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రూ.2 వేల నోట్లను విత్‌డ్రా చేసుకుంటున్నామని సడెన్‌గా ప్రకటించినప్పటికీ, మెజార్టీ ప్రజలు ఈ నిర్ణయానికి మద్ధతుగా నిలుస్తున్నారు. లోకల్ సర్కిల్స్ చేసిన సర్వే ప్రకారం, 64 శాతం మంది రెస్పాండెంట్లు ఆర్‌బీఐ నిర్ణయాన్ని సపోర్ట్ చేయగా, 22 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు. 12 శాతం మంది మాత్రం ఎటువంటి తేడా లేదని పేర్కొన్నారు. 2 శాతం మంది ఏం చేప్పలేమని అన్నారు. రూ.2 వేల నోట్లను విత్‌డ్రా చేసుకోవడంపై ప్రజల ఆలోచనలను, స్మాల్, మీడియం, లార్జ్ సైజ్ బిజినెస్‌లపై దీని ప్రభావాన్ని లోకల్ సర్కిల్స్ ఓ సర్వే ద్వారా తెలుసుకుంది.
మీ దగ్గర ఎన్ని రూ.2 వేల నోట్లున్నాయ్?
తమ దగ్గర ఎన్ని రూ.2 వేల నోట్లు ఉన్నాయని సర్వేలో పాల్గొన్న వారిని లోకల్ సర్కిల్స్ అడిగింది. ఈ ప్రశ్నకు 12,121 రెస్పాన్స్‌లు వచ్చాయని తెలిపింది. 64 శాతం మంది తమ దగ్గర రూ.2 వేల నోట్లు ఏం లేవని చెప్పగా, 6 శాతం మంది మాత్రం రూ.లక్ష విలువైన రూ.2,000 నోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 15 శాతం మంది దగ్గర రూ.15 వేల వరకు, 7 శాతం మంది దగ్గర రూ.20 వేల నుంచి 40 వేల వరకు రూ.2 వేల నోట్లు ఉన్నాయని సర్వే వెల్లడించింది. రూ.40 వేల నుంచి రూ.లక్ష విలువైన రూ.2 వేల నోట్లు ఉన్నాయని 6 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొనగా, రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఉన్నాయని 2 శాతం మంది, రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉన్నాయని 2 శాతం మంది, రూ.10 లక్షల కంటే ఎక్కువ ఉన్నాయని మరో 2 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. బ్లాక్ మనీని కట్టడి చేయడానికే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని 68 శాతం మంది రెస్పాండెంట్లు నమ్ముతున్నారు. సెప్టెంబర్ 30 తర్వాత కూడా రూ.2 వేల నోట్లు లీగల్ టెండర్‌గా కొనసాగుతాయని పేర్కొన్నారు. రూ. 2 వేల నోట్లను విత్‌డ్రా చేసుకుంటామని ఆర్‌బీఐ ప్రకటించాక ఏం చేశారని లోకల్ సర్కిల్స్ రెస్పాండెంట్లను అడిగింది. ఇందుకు 34 శాతం మంది రెస్పాడెంట్లు ఖర్చు చేయడానికి ప్రయత్నించామని వెల్లడించగా, 66 శాతం మంది మాత్రం రూ.2 వేల నోట్లతో ఏం కొనాలనుకోలేదని పేర్కొన్నారు. మరోవైపు రూ.2 వేల నోట్లను ఖర్చు చేయాలని అనుకున్నవారిలో 91 శాతం మంది ఇబ్బందులు పడ్డారు. రిటైల్ స్టోర్లు, హాస్పిటల్స్, ఫార్మసీ, సర్వీస్ ప్రొవైడర్లు, ఇంకా పెట్రోల్ బంకుల్లో కూడా రూ. 2 వేల నోట్లను చేంజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు.
ఎక్స్చేంజ్ లేకపోతే బాగుండే..
ఎటువంటి డాక్యుమెంట్లను తీసుకోకుండానే రూ. 2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని స్టేట్‌బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై లోకల్ సర్కిల్స్ రెస్పాండెంట్ల అభిప్రాయాలను సేకరించింది. ప్రభుత్వం రూ. 2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా కేవలం డిపాజిట్ చేసుకోవడానికే పర్మిషన్ ఇచ్చుంటే బాగుండేనా ? అని ప్రశ్నించింది. దీనికి 68 శాతం మంది రెస్పాండెంట్లు అవునని సమాధానమిచ్చారు. 29 శాతం మంది మాత్రం ఇప్పుడున్నట్టే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఉండాలని అన్నారు. 3 శాతం మంది మాత్రం సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో రూ. 2 వేల నోట్లతో ఫ్యూయల్, గోల్డ్, సిల్వర్ కొనడం బాగా పెరిగినప్పటికీ, 2016 డీమానిటైజేషన్‌లో మాదిరి పానిక్ బయ్యింగ్ మాత్రం రాలేదని లోకల్ సర్కిల్స్ పేర్కొంది. రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకోవడం మెజార్టీ ప్రజలపై ప్రభావం చూపడం లేదని వివరించింది. దేశంలోని 341 జిల్లాల్లోని ప్రజల నుంచి 57 వేల రెస్పాన్స్‌లను లోకల్ సర్కిల్స్ ఈ సర్వే కోసం సేకరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 64 శాతం మంది మగవారు ఉండగా, 36 శాతం మంది మహిళలు ఉన్నారు. 49 శాతం మంది టైర్ 1 సిటీల నుంచి, 34 శాతం మంది టైర్ 2 సిటీల నుంచి, 17 శాతం మంది టైర్3,4 సిటీల నుంచి రూరల్ ప్రాంతాల నుంచి ఉన్నారు. కాగా, సర్క్యులేషన్‌లోని రూ.2 వేల నోట్లను వెంటనే విత్‌డ్రా చేసుకుంటున్నామని ఈ నెల19 న ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.
