V6 News

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌గా మార్చినా.. పొర్లు దండాలు పెట్టినా జనాలు నమ్మరు  :  ఎమ్మెల్యే కేఆర్‍.నాగరాజు 

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌గా మార్చినా.. పొర్లు దండాలు పెట్టినా జనాలు నమ్మరు  :  ఎమ్మెల్యే కేఆర్‍.నాగరాజు 
  • ఆడబిడ్డ కవిత ఉసురు తాకే బీఆర్‍ఎస్‍ పార్టీ ఆగమైంది : వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‍.నాగరాజు 

వరంగల్‍, వెలుగు : బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను  టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌గా మార్చినా, ఆ పార్టీ నేతలు పొర్లు దండాలు పెట్టినా జనం వారిని దగ్గరకు రానియ్యరని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌‌‌‌.నాగరాజు అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆయన నివాసంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. కవిత దెబ్బకు కేటీఆర్‌‌‌‌ మైండ్ బ్లాంక్‌‌‌‌ అయిందని, బీఆర్‍ఎస్‍ పార్టీ వారి ఆడబిడ్డ కవిత ఉసురు తాకిందన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల సహకారంతో ఎదిగి వారినే పార్టీ నుంచి బయటకు పంపారని.. బీఆర్‍ఎస్‍ నేతలు చేసిన ద్రోహన్ని ఎవరూ మర్చిపోలేదన్నారు. కేటీఆర్‌‌‌‌కు ఫాంహౌజ్‌‌‌‌ పార్టీలు, మందు, విందులు తప్పితే మరేమీ తెలియదని ఎద్దేవా చేశారు. అంబేద్కర్‌‌‌‌ జయంతిని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం గంటలకు కేయూ జంక్షన్‌‌‌‌ వద్ద ‘వాక్‌‌‌‌ ఫర్‌‌‌‌ ఈక్వాలిటీ’ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు వివేక్‌‌‌‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌, మానకొండూర్‍ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్‍ నగరిగారి ప్రీతం పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్‍ జిల్లాల అధ్యక్షులు ఇనగాల వెంకటరమణారెడ్డి, అయూబ్‍ పాల్గొన్నారు.