మహాదేవ పూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఆలయ చైర్మన్ గా అవధాని మోహన్ శర్మ ధర్మకర్తలు దొడ్ల అశోక్, కుంభం పద్మ, అడ్డూరి శ్రీధర్ రావు, మంచినీళ్ల దుర్గయ్య, గందెసిరి సత్యనారాయణ, సుంకరి సీతయ్య, జలవంచ సీతారాం, కాటం సత్తయ్య, శ్యాంసుందర్, ఎక్స్ అఫీషియో ఫనకంటి ఫణీంద్ర శర్మతో టెంపుల్ ఈవో మహేశ్ప్రమాణ స్వీ్కారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరమేశ్వరుడికి సేవలో అంకితమై భక్తులకు అందుబాటులో ఉంటామని, తమకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

