జనగామ అర్బన్, వెలుగు : ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్-అలైవ్ కింద రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా నేషనల్ హైవే (యాదాద్రి - వరంగల్ ఎన్హెచ్ -163) ఆధ్వర్యంలో ఆధునిక సదుపాయాలతో కూడిన కొత్త అంబులెన్స్ ను సోమవారం ఏర్పాటు చేశారు. జనగామ కలెక్టరేట్ లో చేపట్టిన కార్యక్రమంలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించారు.

