V6 News

సురక్షిత ప్రయాణమే అందరికీ శ్రేయస్కరం 

సురక్షిత ప్రయాణమే అందరికీ శ్రేయస్కరం 

వెలుగు, నెట్​వర్క్​: సురక్షిత ప్రయాణమే అందరికీ శ్రేయస్కరమని ప్రముఖులు సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ‘అరైవ్​అలైవ్​ కార్యక్రమాన్ని చేపట్టి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ సీపీ సన్‌‌‌‌ప్రీత్ సింగ్, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌‌‌‌పాయ్, సత్యశారద పాల్గొని పలు సూచనలు చేశారు.

ఏప్రిల్ 13 నుంచి 18 వరకు వరంగల్​ కమిషనరేట్ పరిధిలో గ్రామసభలు, 'నో హెల్మెట్ - నో ఎంట్రీ' అమలు, సినిమా థియేటర్లలో షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్న, ప్రత్యేక అవగాహన వాహనాల ద్వారా ప్రచారం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని సీపీ తెలిపారు. అంతకుముందు పోలీసు, రవాణా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ లో రోడ్డు భద్రతపై ప్రదర్శించిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శించిన కల్చరల్ ఈవెంట్స్ ను తిలకించారు.

 ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో సీపీ ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ‌‌‌‌హెల్మెట్ లేకుండా విలేజ్ లోకి ఎవరినీ అనుమతించబోమని, గ్రామస్తులందరూ హెల్మెట్లు వాడుతామని తీర్మానించారు. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల జీపీలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్​ సందీప్​ కుమార్​ఝా, డీసీపీ రాజమహేంద్రనాయక్​ పాల్గొని నిబంధనలపై అవగాహన కల్పించారు. ఖమ్మం జిల్లా రూరల్​ మండలం వరంగల్​ క్రాస్​రోడ్డులో నిర్వహించిన ప్రోగ్రామ్​లో సీపీ సునీల్​దత్​ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతో కలిసి అవగాహన కల్పించారు. భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రోగ్రామ్​లో కలెక్టర్​ అంకిత్​ పాల్గొని వాల్​పోస్టర్లను ఆవిష్కరించారు. పాల్వంచ పట్టణంలో నిర్వహించిన సదస్సులో ఎస్పీ రోహిత్​రాజ్​ పాల్గొని మాట్లాడారు.