
ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో హెల్త్ అవేర్ నెస్ బాగా పెరిగింది. ఆరోగ్యంకోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా శారీరక శ్రమకోసం వాకింగ్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే వాకింగ్ చేయడంలో చాలా మందికి సరియైన పద్దతులు తెలియవు.. కొన్ని తప్పులు చేస్తుంటారు. దీంతో పొందాల్సిన ప్రయోజనం కంటే కొన్ని ఇబ్బందులను కొని తెచ్చుకుంటుంటారు.. అలా జరగకుండా ఉండాలంటే వాకింగ్ లో ఈ తప్పులను నివారించండి.. మంచి ప్రయోజనాలు పొందండి.
రాంగ్ షూ
వాకింగ్ కి వెళ్లే వాళ్లు షూస్ వేసుకోవడం మంచి ఆప్షన్. కానీ కాలికి సరిగా ఫిట్ అయ్యే వాకింగ్ షూ సెలక్ట్ చేసుకోవడంలో పొరపాటు చేస్తే కండరాల నొప్పి, చర్మం గీసుకుపోవడం. పాదంలో నరాలు పట్టేయడం, మోకాలి నొప్పులు రావడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని వాకింగ్ షూ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షూ ఎక్కువ బరువు లేకుండా లైట్ వెయిట్ ఉన్నవే తీసుకోవాలి. షూ బాగా ఫ్లెక్సిబుల్గా ఎలా వంచినా బెండ్ అవ్వాలి. కాలి సైజు కరెక్ట్ గా ఫిట్ అయ్యిందా లేదా అన్నది చెక్ చేయాలి. మరీ వదులుగా ఉన్నా, మరీ టైట్ అయినా ప్రాబ్లమే. అలాగే షూస్ ఏళ్ల తరబడి వాడకూడదు. అడుగున గ్రిప్ లేదా లోపలి సోల్ ఏది అరిగిపోయినా వెంటనే కొత్త షూ కొనుక్కోవడం బెటర్.
సెల్ ఫోన్
వాకింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడడం చాలామనం ఫిట్గా, హెల్దీగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయడం తప్పనిసరి. కానీ అందరికీ జిమ్కి వెళ్లడం కుదిరే పని కాదు. అయితే ఎవరైనా సరే ఈజీగా చేయగలిగే ఎక్సర్సైజ్ వాకింగ్. పొద్దునో, సాయంత్రమో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక అరగంట వాకింగ్ కి వెళ్తే బాడీ ఫిట్గా ఉండడంతో పాటు మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. కానీ వాకింగ్కి వెళ్లేటప్పుడు చేసే కొన్ని రకాల మిస్టేక్స్ వల్ల కండరాలు పట్టేయడం, గాయాలవ్వడం వంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ తప్పులకు చెక్ పెట్టేయాలి.
డేంజర్. నడిచేటప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయే ప్రమాదం ఉంది. పైగా ఫోన్ చూస్తూ నడవడం వల్ల.. వాకింగ్ ద్వారా రిలీఫ్ రావాల్సింది పోయి స్ట్రెస్ పెరుగుతుంది. రోజంతా ఉండే ఫోన్ కాల్స్, మెసేజ్ లు ఆ కొంచెం సేపు పక్కనపెట్టి వాకింగ్ చేస్తే మెంటల్ గా రిలీఫ్ ఉంటుంది. కొంతమంది వాకింగ్ లో మ్యూజిక్ వింటుంటారు. ఇది కూడా అంత మంచిది కాదు.
స్టిఫ్ వాకింగ్
నడిచేటప్పుడు కాళ్ల మూమెంట్ కు తగ్గట్టు చేతులు కూడా ముందుకీ వెనక్కి కదలాలి. కొందరు చేతులు కదలకుండా స్టిఫ్ గా పెట్టుకుని నడుస్తుంటారు. చేతులు మూవ్ అవ్వడం నేచురల్ గా జరుగుతుంది. దీన్ని రిస్ట్రిక్ట్ చేస్తే మజిల్ పెయిన్ వస్తుంది. అలాగే నడిచేటప్పుడు మరీ స్లోగా కాకుండా కొంచెం స్పీడ్ వాక్ చేయడం బాడీ ఫిట్ నెస్ కి మంచిది. అయితే తలని వాల్చేసి, బాడీని లూజ్ బెండ్ చేసి వాకింగ్ చేస్తే నెక్, బ్యాక్ పెయిన్ వస్తాయి. శరీరం స్టిఫ్ గా ఉండేలా చూసుకుని, చేతులు మాత్రం కదిలేలా వాక్ చేయాలి.
వాకింగ్ కి వెళ్లేటప్పుడు షూ ఎంత జాగ్రత్తగా సెలక్ట్ చేసుకుంటారో... డ్రస్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి. డ్రస్ మరీ టైట్గా ఉండొద్దు. లూజ్ గా ఉండే బట్టలు వేసుకోవాలి. వీలైనంత వరకు సిల్క్ డ్రెస్లు కాకుండా చెమటను పీల్చుకునేలా కాటన్వి అయితే మేలు. చలికాలంలో మాత్రం చెవులు కవర్ అయ్యేలా మపర్ లేదా క్యాప్ లాంటివి పెటుకోవాలి.
వామప్
వాకింగ్ స్టార్ట్ చేసే ముందు, అయిపోయాక వామప్ చేస్తే కండరాలు బాగా ఫ్రీ అవుతాయి. కాళ్లు కొంచెం ఎత్తులో పెట్టి స్ట్రెచ్ చేశాక స్లోగా వాకింగ్ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా స్పీడ్ పెంచాలి. అలాగే వాకింగ్ ఆపేసేటప్పుడు కూడా ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా స్పీడ్ తగ్గించి ఆగాలి. ఆ తర్వాత కింద కూర్చుని కాళ్లు రెండు చాపుకొని కొంచెం సేపు షేక్ చేసి ఆ తర్వాత లేచి రెగ్యులర్ పనుల్లోకి వెళ్లిపోవచ్చు.
పెద్ద పెద్ద అడుగులొద్దు
వాకింగ్ చేసేటప్పుడు ఫాస్ట్ గా ఎక్కువ దూరం కవర్ చేయాలని అడుగులు చాలా ఎక్కువ గ్యాప్ వేస్తూ నడుస్తారు. ఇది సరైంది కాదు. దీని వల్ల స్పీడ్గా నడవలేరు కదా.. పాదం వెనుక భాగంలో నొప్పి వస్తుంది. అదే అడుగులు దగ్గరగా వేస్తూ స్పీడ్గా నడిస్తే ఎలాంటి సమస్యలు రావు.
డీ-హైడ్రేషన్
వాకింగ్ చేసినప్పుడు చెమట పట్టి శరీరం డీ-హైడ్రేట్ అవుతుంది. దీని వల్ల నీరసంతో రోజంతా డల్గా ఉంటాం. ఇలా జరగకుండా ఉండాలంటే రోజూ రెండు మూడు లీటర్ల నీళ్లు తాగాలి. గంటకి ఒకసారి ఒక గ్లాసు చొప్పున నీళ్లు తాగితే మేలు. వాకింగ్ కు వెళ్లే 10 నిమిషాల ముందు, ముగించాక కొద్దిసేపటి తర్వాత గ్లాస్ నీళ్లు తాగాలి. కానీ వాకింగ్కి వెళ్లే ముందు ఎక్కువ వాటర్ తాగడం మంచిది కాదు. ఎక్కువదూరం వాకింగ్కి వెళ్తే... మధ్యలో దాహం అనిపిస్తే మధ్యలో కొన్ని వాటర్ సిప్ చేయొచ్చు.