ప్యూర్ థన్ 2కె, 5కె రన్ లను ప్రారంభించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

ప్యూర్ థన్  2కె, 5కె రన్ లను  ప్రారంభించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్యూర్ థన్  2కె,5కె రన్ లను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్, మాదాపూర్ డీసీపీ శిల్ప వల్లి, డైరెక్టర్ మెహర్ రమేష్, యాక్టర్ సత్య దేవ్, దివి, సింగర్ గీతా మాధురీ, ప్యూర్ ఫౌండర్ లతో పాటు భారీ సంఖ్యలో యువతీ,యువకులు, వాకర్స్ పాల్గొన్నారు. దీంతో పాటు యువతుల రుతుక్రమ సమస్యల పై అవేర్నెస్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఈ క్రమంలో రుతుక్రమంపై సాంగ్ రిలీజ్ చేసిన ఆర్టీసీ ఎండి సజ్జనార్... గ్రామీణ ప్రాంతాల్లో రుతుక్రమం పై అవగాహన రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. పీరియడ్స్ అనేది నార్మల్ గా జరిగే ప్రాసెస్  అన్న ఆయన... దీని గురించి అందరూ తెలుసుకోవాలన్నారు. పీరియడ్స్ గురించి సిగ్గు పడాల్సిన అవసరం లేదన్న సజ్జనార్... రుతుక్రమం సమయంలో చిన్నారులను దూరం పెట్టవాల్సిన అవసరం లేదని తెలిపారు. పీరియడ్స్ పై గ్రామీణ ప్రాంతాల్లో, మగవారిలో అవగాహన రావాల్సిన అవసరం ఉందని సజ్జనార్ అన్నారు. మహిళల కోసం ఆర్టీసీ మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చామని చెప్పారు. 

ఈ ప్యూర్ థన్ రన్ తో పీరియడ్స్ సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామని ప్యూర్ సంస్థ చైర్మన్ శైలకందురీ తెలిపారు. ఈ వాక్ థాన్ లో 3000 వేల మంది పాల్గొన్నారన్న ఆయన... గ్రామీణ ప్రాంతాల్లో రుతుక్రమం సమయంలో చిన్నారులు ప్యాడ్స్ వాడటం లేదని గుర్తు చేశారు. ఈ పీరియడ్స్ తో  చదువుకు దూరం అవుతున్నారని... పీరియడ్స్ అనేది నార్మల్ గా జరిగే ప్రాసెస్ అని స్పష్టం చేశారు. ఆర్టీసీ సహకారంతో ప్యూర్ సంస్థ బస్టాప్ స్టాండ్స్ లో సానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మిషన్స్ అందిస్తామని ప్రకటించారు.