
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో పర్మినెంట్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆగస్టు నెల జీతం పడలేదు. ఈ నెల 1న రావాల్సిన జీతాలు 13వ తేదీ వచ్చినా అందకపోవడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.
ALSO READ: పెంచిన జీతాలు ఇయ్యకుంటే వంట బంద్
కొన్ని నెలలుగా ఇదే విధంగా జీతాలు ఆలస్యమవుతున్నప్పటికీ పట్టించుకునే వారు లేరని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10వ తేదీ దాటినా వేతనాలు అందకపోవడంతో ఇన్‌టైమ్‌లో ఈఎంఐలు చెల్లించలేక చెక్కులు బౌన్స్ అవుతున్నాయని, పెనాల్టీలు కట్టాల్సి వస్తుందని వాపోయారు. ఒకటో తేదీన జీతాలు వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు.