గణేష్ విగ్రహాల ప్రతిష్టాపనకు అనుమతి తీసుకోవాలి

గణేష్ విగ్రహాల ప్రతిష్టాపనకు అనుమతి తీసుకోవాలి

గణేశ్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని… ఇందుకు నగర ప్రజలందరూ సహకరించాలని పిలుపు నిచ్చారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌. అయితే వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలనుకునే వారు తప్పని సరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.  ప్రతి డివిజన్‌లోనూ, ప్రతి విగ్రహానికీ ఏసీపీ కార్యాలయం నుంచి రాతపూర్వక పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. దానికి సంబంధించి అనుమతి కోరే పత్రాలు ఈ నెల 22 నుంచి 26 వరకు అన్ని పోలీస్ ‌స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయని సీపీ చెప్పారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలు ఈనెల 29 లోపు సమర్పించాలన్నారు.

అంతేకాదు.. విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు అదనపు సిబ్బందితో పోలీసు బందోబస్తు చేపడుతున్నట్లు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.  ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సూచనలు జారీ చేశారు. సెప్టెంబర్‌ 2 నుంచి 12 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా బాణసంచా పేల్చడం… వాటిని ఇతరుల మీదికి విసరేయడం లాంటి చర్యలను పూర్తిగా నిషేధించారు. బాణసంచా పేల్చడంపై ఉత్సవాలు సాగే… సెప్టెంబర్‌ 2 ఉదయం 6 నుంచి 12 సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు సీపీ.