హ్యాట్సాఫ్ సార్ : ముక్కుకు ఆక్సిజన్ సిలిండర్.. అయినా బూత్ వచ్చి ఓటేశారు..

హ్యాట్సాఫ్ సార్ : ముక్కుకు ఆక్సిజన్ సిలిండర్.. అయినా బూత్ వచ్చి ఓటేశారు..

ఈరోజు ( నవంబర్​ 30) తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్​ కొనసాగుతోంది.  ఈ ఎన్నికల్లో యువత , మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  అయితే కొంతమంది వృద్దులు కూడా ఓటేశారు.  అనారోగ్యంతో బాధ పడుతున్న వారు ఓటేసి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.  లివర్‌ సిరోసిస్‌తో బాధపడుతున్న ఓ పెద్దాయన ఆక్సిజన్‌ సిలిండర్‌ సాయంతో ఓటు వేయడానికి పోలింగ్‌ స్టేషన్‌కి వచ్చారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన శేషయ్య (75) లివర్‌ సిరోసిస్‌తో బాధపడుతున్నారు. ఓటు వేయడానికి ఏకంగా ఆక్సిజన్ సిలిండర్‌తో ఆయన పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. గచ్చిబౌలి జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌ పోలింగ్‌ కేంద్రంలో శేషయ్య ఓటు వేశారు. ఓటు వేయడం ఓ పౌరుడిగా తన బాధ్యత అని శేషయ్య చెప్పారు. శేషయ్యకు సంబందించిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.