మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోంది : అనురాగ్ ఠాకూర్

మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోంది :  అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ ఎకనామిక్ కాన్ క్లేవ్​లో ఆయన మాట్లాడారు. ‘‘పదేండ్ల కింద దేశం ఆర్థిక ఇబ్బందులతో అల్లాడింది. ఏ రంగంలో చూసినా అవినీతే. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకుంది. కాంగ్రెస్​కు ప్రత్యామ్నా యంగా మోదీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తే.. చాయ్ అమ్ముకునే వ్యక్తి దేశాన్ని నడిపిస్తడా? అని కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఆయన వెనకబడిన కులానికి చెందిన వ్యక్తి అని అవమానించింది. కానీ ఇప్పుడు ఆ వ్యక్తే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు” అని ఠాకూర్ అన్నారు.