అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా పేసర్

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా పేసర్

ఆస్ట్రేలియా పేస్‌మ్యాన్ పీటర్ సిడిల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సిడ్నీలో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్ తర్వాత తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో సిడిల్ తన సహచరులకు తెలియజేశాడు. సిడిల్ తన 67 టెస్టు మ్యాచ్‌ల కెరీర్‌లో 221 వికెట్లు పడగొట్టాడు. తన 35 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ ప్రకటించిన సిడిల్.. దేనికి ఎప్పుడు టైం వస్తుందో తెలియదని ఆయన అన్నారు. తన రిటైర్మెంట్‌కి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు ఆయన అన్నారు.

సిడిల్ విక్టోరియా స్టేట్ తరపున మరియు అడిలైడ్ స్ట్రైకర్స్ కోసం బిగ్ బాష్ లీగ్‌లో ట్వంటీ 20 జట్టులో కొనసాగుతాడు. సిడిల్ 2008లో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మొహాలి మ్యాచ్‌తో టెస్ట్‌లలో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో సిడిల్ తొలి వికెట్‌గా సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేశాడు. బ్రిస్బేన్‌లో 2010 యాషెస్ టెస్టులో తన 26వ పుట్టినరోజు నాడు.. ఇంగ్లండ్‌కు చెందిన అలెస్టెయిర్ కుక్, మాట్ ప్రియర్ మరియు స్టువర్ట్ బ్రాడ్‌లను వరుసగా బంతుల్లో అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. హ్యాట్రిక్ సాధించిన ఆస్ట్రేలియన్ బౌలర్లలో సిడిల్ తొమ్మిదోవాడు. తన కెరీర్ ప్రారంభంలో గాయాలతో బాధపడుతున్నప్పటికీ, సిడిల్ తన బౌలింగ్ ప్రతిభతో అత్యంత మన్నికైన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్ మరియు మిచెల్ స్టార్క్‌లు జట్లులోకి రావడం, వారి ఆట తీరు మెరుగుగా ఉండటంతో సిడిల్‌కు ప్రాధాన్యం తగ్గింది. సిడిల్ 2016-2018 కాలంలో జట్టు తరపున ఏ ఒక్క మ్యాచ్ ఆడలేదు.

For More News..

నా త్రండ్రి మళ్లీ అధ్యక్షుడైతే వైట్ హౌస్ నుండి వెళ్లిపోతా

విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ‘విరుష్క’ జంట