శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్

శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హైకోర్టులో  పిటిషన్

జీడీమెట్ల లోని సర్వే నంబర్ 38/8, 38/9 లో గల భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలంటూ తన కుటుంబాన్ని శేరిలింగంపల్లి  బీఆర్ఎస్  ఎమ్మెల్యే  అరికెపూడి గాంధీ  బెదిరించారని సులోచన అగర్వాల్ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.  అర్ధ రాత్రి ఎమ్మెల్యే గాంధీ మనుషులు ఫ్యాక్టరీలో దోపిడీ చేసినా  పోలీసులు స్పందించలేదని తన పిటిషన్ లో  పేర్కొన్నారు.  

ALSO READ:కేసీఆర్ సీఎం కావడం పేదలకు శాపం... స్కామ్లు తప్ప చేసిందేమీ లేదు

ఇరవై కోట్ల రూపాయల మిషిన్లను అల్యూమినియం బండెల్ లను గాంధీ..  పోలీసుల సాయంతో దోపిడీ చేసారని ఆమె ఆరోపించారు.  దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం...ఈ  ఘటనపై ఇన్స్పెక్టర్ ప్రశాంత్, ఎస్ ఐ మల్లేశ్వర్ లు సమగ్ర నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది. ఎమ్మెల్యే గాంధీకి వ్యక్తిగతంగా కూడా నోటీసులు పంపాలంటూ పిటిషనర్ కు సూచించింది న్యాయస్థానం. తదుపరి విచారణను 2023 ఆగస్టు 10కి వాయిదా వేసింది హైకోర్టు.