కేసీఆర్ సీఎం కావడం పేదలకు శాపం... స్కామ్లు తప్ప చేసిందేమీ లేదు

కేసీఆర్ సీఎం కావడం పేదలకు శాపం... స్కామ్లు తప్ప చేసిందేమీ లేదు

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు పేదలకు ఇండ్లు రావని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బిఅరెస్ ఎమ్మెల్యేలను ఎన్నుకున్నన్ని రోజులు పేదలకు పక్కా ఇండ్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పుకుని రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఆ హామీని గాలికొదిలేశారని మండిపడ్డారు.  డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలంటూ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్ పాత కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. 

పేదలకు శాపం కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం అని ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. 20-21 లో రూ.  10వేల కోట్లు, 21-22 లో రూ. 10.80 వేల కోట్లు బడ్జెట్ ప్రకటించి ఇళ్ల నిర్మాణం మాత్రం చేపట్టలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ. 18 వేల 500 కోట్లు కేటాయించిన కేసీఆర్..  ఆ నిధులను పక్క దారి మళ్లించారని విమర్శించారు. తెలంగాణకు పట్టిన అతిపెద్ద దరిద్రం కల్వకుంట్ల కుటుంబం అని...కేసీఆర్ కుటుంబం  స్కామ్ లు తప్ప చేసింది ఏమి లేదన్నారు ఎంపీ అర్వింద్.

ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అని చెప్పి.. దాన్ని  రూ.3 లక్షలకు కుదించిన పాపాత్ములు కేసీఆర్, హరీష్ రావు అని ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఖాళీ జాగా ఉంటే రూ.3 లక్షలు అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారని....డబుల్ బెడ్ రూంల స్కామ్ డబ్బులతో లిక్కర్ స్కామ్ చేసిన చరిత్ర కవితది అని మండిపడ్డారు. కవితది ఐరన్ లెగ్.. ఆమె తో సహవాసం చేస్తే జైలుకెళ్లటం ఖాయమన్నారు.  బిజెపికి ఓట్లేస్తేనే డబుల్ బెడ్ రూంలు వస్తాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి పరురాలు కల్వకుంట్ల కవిత అని....నేను ముక్కు నేలకు రాయటం కాదు, కేసీఆర్ తో రాకిపిస్తా శపథం చేశారు.  డబుల్ బెడ్ రూంల అవినీతి సొమ్ము, కాళేశ్వరం అవినీతి సొమ్ముతో మహారాష్ట్రలో పార్టీ ప్రచారం చేస్తున్న అవినీతి పరుడు కేసీఆర్ అని ఆరోపించారు. కవిత తనపై పోటీ చేయటానికి భయపడుతుందని..అలాంటి కవిత గురించి మాట్లాడి టైమ్ వెస్ట్ చేసుకోవటం అనవసరం అన్నారు. 

ALSO READ:శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్

మంత్రి ప్రశాంత్ రెడ్డికి సోయి లేదని ఎంపీ అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  భీంగల్ లో బస్సు డిపో కట్టలేనోడు, డబుల్ బెడ్ రూంలు కడ్తడా అని ప్రశ్నించారు. ఆర్టీసీ ఆస్తులు మొత్తం జీవన్ రెడ్డికి అప్పచెప్తే, ఆర్టీసీ లాభాల్లో ఎట్లా ఉంటదని నిలదీశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి బుద్దిలేదని....తన తమ్ముడు గంజాయి దందా చేస్తున్నాడని మంత్రి ప్రశాంత్ రెడ్డే ఒప్పుకున్నాడని విమర్శించారు.