షుగర్ పేషెంట్లకు AI టూల్... వ్యాధి రకాన్ని కూడా ఖచ్చితంగా చెబుతుంది..!

షుగర్ పేషెంట్లకు AI టూల్... వ్యాధి రకాన్ని కూడా ఖచ్చితంగా చెబుతుంది..!

షుగర్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని బాధిస్తోంది. 20 నుంచి 79 ఏళ్ళ వయసున్న సుమారు 59 కోట్ల మందికి షుగర్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 85.3 కోట్లకు పెరగచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో షుగర్ వ్యాధిని గుర్తించడమే కాకుండా వ్యాధి రకాన్ని కూడా ఖచ్చితంగా గుర్తించే AI టూల్ ను డెవలప్ చేశారు సైంటిస్టులు.

షుగర్ రకాన్ని కూడా ఖచ్చితంగా గుర్తించే AI టూల్ ను సైంటిస్టులు రూపొందించారని తెలిపింది సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్.మధుమేహ రోగుల కోసం మెరుగైన, మరింత పర్సనలైజ్ గా చికిత్సా విధానాలను రూపొందించడంలో వైద్యులకు పరిశోధకులకు ఈ టూల్ ఉపయోగపడుతుందని అంటున్నారు.

షుగర్ రకాన్ని గుర్తించడం కీలకం:

షుగర్ లో టైప్ 1, టైప్ 2 మాత్రమే కాకుండా చాలా రకాలున్నాయి.. రకాన్ని బట్టి చికిత్స ఉంటుంది. వ్యాధి రకాన్ని ఖచ్చితంగా గుర్తించకపోతే చికిత్స ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. టైప్ 1, టైప్ 2తో టైప్ 3, టైప్ 4 గెస్టేషనల్ డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ వంటి రకాలు ఉన్నాయి.

ALSO READ : OnePlus N6x స్మార్ట్ ఫోన్ వచ్చేసింది..

కొత్త AI సాధనం ఎలా పనిచేస్తుంది

క్లినికల్, పేషెంట్ హెల్త్ డేటాను డేటా సెల్ కే అందించడం ద్వారా కొత్త AI టూల్ రూపొందించారు. ఈ టూల్ షుగర్ రకాన్ని కూడా ఖచ్చితంగా గుర్తించి నిర్దిష్ట రోగనిర్ధారణ లేబుల్‌ను కేటాయిస్తుంది. అయితే.. ఈ టూల్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది.