మద్యం షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు ఇవ్వాలి : హైకోర్టులో పిటిషన్లు

మద్యం షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు ఇవ్వాలి : హైకోర్టులో పిటిషన్లు

మద్యం షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు ఇవ్వాలంటూ హైకోర్టులో పలు   పిటిషన్లు దాఖలయ్యాయి.  వైన్ షాప్ టెండర్స్ నోటిఫికేషన్ రద్దు చేయాలని,  మద్యం టెండర్స్ లో గౌడ్ రిజర్వేషన్  కల్పించాలంటూ  పిటిషన్ వేశారు.   మద్యం టెండర్స్ లో వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. షెడ్యూల్ కాస్ట్ పీసా చట్టంను సవాలు చేస్తూ పిటిషన్ వేశారు.  అయితే అన్ని పిటిషన్ లను కలిపి విచారిస్తామని జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి తెలిపారు.  తదుపరి విచారణను ఆగస్టు 19 మధ్యాహ్నం 2.30 కి వాయిదా వేసింది హైకోర్టు.

రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం రికార్డు స్థాయిలో అప్లికేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్స్ ఉండగా.. ఆగస్టు 18 చివరి రోజు కావడంతో సాయంత్రం 6 గంటల వరకు 1.07 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 18న  ఒక్కరోజే 45 వేలకు పైగా రావడం గమనార్హం. దీంతో ప్రభుత్వ ఖజానాకు అప్లికేషన్ల ద్వారానే రూ.2,140 కోట్ల ఆదాయం సమకూరింది