మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.. వరుసగా తొమ్మిదోసారి

మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.. వరుసగా తొమ్మిదోసారి

మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగటంతో… దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో దేశంలో వరుసగా తొమ్మిదో రోజు ఆయిల్ రేట్లు హెక్ అయ్యాయి. ఇవాళ లీటర్ పై 25 పైసలు పెరిగింది.  దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 89.54 గా ఉంది. డీజిల్ రూ. 79.95 కు చేరింది. అటు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి.  లీటర్ పెట్రోల్ 96 రూపాయలకు చేరుకోగా.. డీజిల్ రూ. 86.98 పైసలుగా ఉంది.

ఇటు హైదరాబాద్ లోనూ పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.93.10 పైసలుగా ఉంది. డీజిల్ రూ. 87.20కి  చేరుకుంది. పెట్రోల్ తో పాటు గ్యాస్ ధరలు వరుసగా పెరుగుతుండటంపై మండిపడతున్నారు వాహనదారులు. సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నారని ఫైర్ అవుతున్నారు.

పాల వ్యాపారం కోసం హెలికాప్టర్ కొన్న రైతు

మార్చిలో భూమి దగ్గరగా ఆస్టరాయిడ్‌‌ ..