పెట్రోల్ బంకులో మోసం.. నోజాల్‌‌‌‌ సీజ్

పెట్రోల్ బంకులో మోసం.. నోజాల్‌‌‌‌ సీజ్

మెదక్ జిల్లా, వెలుగు: పెట్రోల్ పోయడంలో అవకతవకలకు పాల్పడుతున్నారని వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు సివిల్ సప్లై ఆఫీసర్లు ఆ బంక్‌‌‌‌  నోజాల్‌‌‌‌ను సీజ్ చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మునిపల్లి మండలం లింగంపల్లికి చెందిన చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌గౌడ్ సోమవారం తన ఎర్టిగా వాహనంలో కందిలోని శంకర్‌‌‌‌‌‌‌‌పల్లి రోడ్డు హెచ్‌‌‌‌పీ పెట్రోల్ బంక్‌‌‌‌కు వెళ్లి ట్యాంక్ ఫుల్ చేయాలని చెప్పాడు. అయితే అక్కడి సిబ్బంది ట్యాంక్ ఫుల్ చేయగా అందులో 52 లీటర్లకు పైగా పెట్రోల్ పోసినట్లు రీడింగ్ చూపి, బిల్లు ఇచ్చారు. దీంతో షాక్ కు గురైన చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ తన వాహనంలో 45 లీటర్లకు మించి పెట్రోల్ పట్టదని, 52 లీటర్లకు పైగా ఎలా పట్టిందని అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. మాకేం తెలుసు మీ ట్యాంకులో పట్టింది అని వాళ్లు నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. దీంతో చంద్రశేఖర్ సివిల్ సప్లై ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. సివిల్ సప్లై ఆఫీసర్లు సురేశ్‌‌‌‌కుమార్, షఫీయొద్దీన్ అక్కడకు వచ్చి వాహనం కంపెనీ సిబ్బందితో మాట్లాడారు. వారు 45 లీటర్లకు మించి పెట్రోల్ రాదని చెప్పారు. దీంతో పెట్రోల్ నోజాల్‌‌‌‌ను సీజ్ చేశారు. అనంతరం హెచ్‌‌‌‌పీ పెట్రోల్ సేల్స్ మేనేజర్, మెట్రోలజీ ఆఫీసర్లను పిలిచి పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని సురేశ్‌‌‌‌కుమార్ తెలిపారు.