మంగపేట మండలం పెట్రోల్ బంక్లో తనిఖీలు

మంగపేట మండలం పెట్రోల్ బంక్లో తనిఖీలు

మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం పెట్రోల్ బంకుల్లో తూనికలు కొలతల జిల్లా అధికారి శ్రీలత సోమవారం తనిఖీలు చేపట్టారు. కొలతల ప్రకారం పెట్రోల్, డీజిల్ అందుతున్నాయా లేదా అని శాంపిల్ తీసి పరీక్షించారు.

పెట్రోల్ బంకుల్లో ప్రతి ఏటా స్టాంప్ వెరిఫికేషన్ చేయాలన్నారు.  తూనికలకు సంబంధించి అవకతవకలుంటే వినియోగదారులు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.  అలాగే పలు రేషన్ షాపుల్లో వెయిట్ మిషన్ పరిశీలించారు.