పెట్రోల్, డీజిల్ రేట్లు ఆల్ టైం రికార్డ్

పెట్రోల్, డీజిల్ రేట్లు ఆల్ టైం రికార్డ్

పెట్రోల్, డీజిల్ రేట్లు ఆల్ టైం రికార్డ్ సృష్టిస్తున్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 103 రూపాయల 89 పైసలకు పెరిగింది. ఇవాళ పెట్రోల్ పై 26 పైసలు, డీజిల్ పై 7 పైసలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 101 రూపాయల 59 పైసలకు పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్ రేటు 97 రూపాయల 76 పైసలకు చేరింది. చెన్నైలో 98 రూపాయల 88 పైసలు, కొల్ కతాలో 97 రూపాయల 63 పైసలకు పెట్రోల్ రేట్ పెరిగింది. కరోనా దెబ్బ నుంచే ఇంకా కోలుకోని జనానికి పెరుగుతున్న రేట్లు మరింత భారంగా మారాయి.