
పెట్రోల్ , డీజిల్ రేట్లు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. పెట్రోల్ , డీజిల్ ధరలు వరుసగా ఆరో రోజు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు 88 రూపాయల 73పైసలకు చేరింది. ఇవాళ 29 పైసలు పెరిగింది. డీజిల్ ధర 32 పైసలు పెరిగి 79 రూపాయల 6 పైసలకు చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ 92 రూపాయల దాటింది. నిన్న 91 రూపాయల 96 పైసలుండగా… ఇవాళ 31 పైసలు పెరిగి 92 రూపాయల 26 పైసలకు చేరింది. డీజిల్ కూడా 86 రూపాయల 23 పైసలకు చేరింది. ముంబయిలో డీజిల్ లీటర్ కు 86 రూపాయల 4 పైసలకు చేరింది. పెట్రోల్ 95 రూపాయల 21 పైసలుగా ఉంది.మధ్యప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ 96 రూపాయలు దాటింది. అక్కడ పెట్రోల్ ధర 96 రూపాయల 69 పైసలుగా ఉంది. డీజిల్ ధర 87 రూపాయల 20 పైసలుగా ఉంది.