హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర

V6 Velugu Posted on Jun 14, 2021

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర సెంచరీ దాటింది. పెట్రో ధరలపై సామాన్యులు గగ్గోలు పెడుతున్నా.. పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు మాత్రం ఆగడం లేదు. సోమవారం మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై మరో 29 పైసల నుంచి 31 పైసలు పెంచాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డు సృష్టించాయి. 

హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల 20 పైసలకు చేరింది. అదేవిధంగా లీటర్ డీజిల్ ధర 95 రూపాయల 14 పైసలకు చేరింది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల 7 పైసలుగా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర మెదక్ జిల్లాలో 101 రూపాయల 20 పైసలుగా ఉంది. ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోనూ లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది.

ఇక ముంబైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 102 రుపాయల 58 పైసలకు చేరింది. ముంబైలో డీజిల్ కూడా వంద రూపాయల వైపు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం అక్కడ లీటర్ డీజిల్ ధర 94 రూపాయల 70 పైసలుగా ఉంది. ఇక ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 96 రూపాయల 41 పైసలకు చేరగా.. లీటర్ డీజిల్ ధర 87 రూపాయల 28 పైసలకు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 97 రూపాయల 69 పైసలుగా ఉండగా...లీటర్ డీజిల్ ధర 91 రూపాయల 92 పైసలుగా ఉంది.

Tagged Hyderabad, Telangana, Oil companies, Petrol price, diesel price, petrol cost

Latest Videos

Subscribe Now

More News