ఫైజర్‌‌, మోడెర్నా వేస్కుంటే 91 శాతం సేఫ్‌‌

ఫైజర్‌‌, మోడెర్నా వేస్కుంటే 91 శాతం సేఫ్‌‌
  • అమెరికా సైంటిస్టుల స్టడీలో వెల్లడి

వాషింగ్టన్‌‌: ఫైజర్‌‌, మోడెర్నా వ్యాక్సిన్లు వేసుకున్నోళ్లకు కరోనా సోకే చాన్స్‌‌ 91% తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది. ఒకవేళ సోకినా లక్షణాలు తీవ్రం కావని, తక్కువ సమయంలోనే వైరస్‌‌ కంట్రోల్‌‌లోకి వస్తుందని వెల్లడైంది. అమెరికా సైంటిస్టులు చేసిన ఈ స్టడీకి సంబంధించిన వివరాలు న్యూ ఇంగ్లండ్‌‌ జర్నల్‌‌ ఆఫ్‌‌ మెడిసిన్‌లో పబ్లిష్‌‌ అయ్యాయి. ఫైజర్‌‌, మోడెర్నా వ్యాక్సిన్లు తొలి డోసు వేసుకున్నాక రెండు వారాలకు 81%, రెండో డోసు వేసుకున్నాక రెండు వారాలకు 91% వ్యాధి నిరోధకత ఉంటుందని స్టడీ వెల్లడించింది. అమెరికా వ్యాప్తంగా 3,975 మందిపై ఈ స్టడీ చేశారు. 2020 డిసెంబర్‌‌ నుంచి 2021 ఏప్రిల్‌‌ వరకు 17 వారాల పాటు వీళ్లు తమ శాంపుల్స్‌‌ను స్టడీ కోసం అందించారు. ఒకటి లేదా రెండు డోసులు వ్యాక్సిన్‌‌ వేసుకున్నోళ్లకు వైరస్‌‌ సోకినా వ్యాక్సిన్‌‌ వేసుకోని వాళ్లతో పోలిస్తే చాలా తక్కువ లక్షణాలు కనించాయి. అనారోగ్యంతో బెడ్‌‌కు పరిమితమయ్యే రోజులు 60% తగ్గాయి. పైగా 2.7 రోజుల్లోనే వైరస్‌‌ లోడ్‌‌ 70% వరకు తగ్గింది. ఫైజర్‌‌, మోడెర్నా రెండూ కూడా ఎంఆర్‌‌ఎన్‌‌ఏ వ్యాక్సిన్లు. వీటిల్లో కరోనా స్పైక్‌‌ ప్రోటీన్‌‌ జెనెటిక్‌‌ ఇన్‌‌స్ట్రక్షన్స్‌‌ ఉంటాయి. మన శరీరం ఈ స్పైక్‌‌ ప్రోటీన్‌‌కు వ్యతిరేకంగా నిరోధకతను డెవలప్‌‌ చేసుకుంటాయి. మున్ముందు వైరస్‌‌ సోకితే ఎలా ఫైట్‌‌ చేయాలో నేర్చుకుంటాయి.