ఫైజర్ వ్యాక్సిన్ ఎఫెక్టివ్‌నెస్ తక్కువే

ఫైజర్ వ్యాక్సిన్ ఎఫెక్టివ్‌నెస్ తక్కువే

ఫైజర్ వ్యాక్సిన్ ఎఫెక్టివ్ నెస్ తక్కువేనని ఫ్రాన్స్‌కు చెందిన పాశ్చర్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. అయితే భారత్‌లో గుర్తించిన వేరియంట్ నుంచి మాత్రం పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తోందని స్పష్టం చేసింది. మొత్తం 28 మంది హెల్త్ వర్కర్లపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని తెలిపింది. మొత్తం 28 మందిలో 16 మందికి రెండు డోసుల ఫైజర్ వ్యాక్సిన్, 12 మందికి అస్ట్రాజెనికా ఒక డోసు వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. ఫైజర్ రెండు డోసులు తీసుకున్నవారిలో B.1.617 వేరియంట్‌కు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలు తగ్గాయని పాశ్చర్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపారు. అదే అస్ట్రాజెనికా ఒక డోసు తీసుకున్నవారిలో పరిస్థితి భిన్నంగా ఉందని తెలిపింది. గడిచిన ఏడాది కరోనా బారిన పడి ఫైజర్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు అవసరమైనన్ని యాంటీ బాడీస్ కలిగి ఉన్నారని సంస్థ ప్రతినిధులు చెప్పారు.