పీజీ  మెడికల్‌‌, డెంటల్‌‌ విద్య  మాప్ అప్ వెబ్ కౌన్సెలింగ్‌‌

పీజీ  మెడికల్‌‌, డెంటల్‌‌ విద్య  మాప్ అప్ వెబ్ కౌన్సెలింగ్‌‌

వరంగల్ సిటీ, వెలుగు: పీజీ మెడికల్‌‌, డెంటల్‌‌ విద్య కన్వీనర్ కోటా సీట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజీ హెల్త్‌‌ యూనివర్సిటీ అధికారులు ‌‌తెలిపారు. గురువారం మాప్ అప్ విడత ప్రవేశాలకు హెల్త్‌‌ వర్సిటీ ప్రకటన విడుదల చేసింది. తుది మెరిట్‌‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని చెప్పింది.

ఇప్పటికే మొదటి, రెండవ విడతల్లో అడ్మిషన్లు పొందిన అభ్యర్థులు ఈ విడత కౌన్సెలింగ్‌‌కు అర్హులు కాదని పేర్కొంది. సీట్ల ఖాళీల వివరాలను వర్సిటీ వెబ్‌‌సైట్‌‌లో అందుబాటులోకి ఉంచామంది. ఈ నెల 24, 25 తేదీల్లో ప్రాధాన్యత క్రమంలో కాలేజీల వారిగా వెబ్‌‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. వివరాలకు www.knruhs.telangana.gov.inలో చూడాలని అధికారులు సూచించారు.