IPL 2025: వీరు భలే లక్కీ: వరుసగా రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఇద్దరు ప్లేయర్స్ వీరే

IPL 2025: వీరు భలే లక్కీ: వరుసగా రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఇద్దరు ప్లేయర్స్ వీరే

ఐపీఎల్ ను ఒకసారి కొట్టడమే ఆటగాళ్లకు కల. అలాంటింది రెండు సార్లు ఈ టైటిల్ అందుకుంటే అదొక అద్భుతమైన జ్ఞాపకం. కానీ వరుసగా రెండు సీజన లలో ఐపీఎల్ టైటిల్ అందుకోవడం నెక్స్ట్ లెవల్ ఫీలింగ్ అనే చెప్పుకోవాలి. ఈ ఘనత సాధించిన వారి లిస్తులో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ పిల్ సాల్ట్ కాగా.. మరొకరు స్పిన్నర్ సుయాశ్ శర్మ. వీరిద్దరూ ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన జట్టులో ప్లేయర్స్. అంతేకాదు ఐపీఎల్ 2024 సీజన్ లో కూడా వీరు ఐపీఎల్ టైటిల్ గెల్చిన జట్టులో సభ్యులే. 2024 ఐపీఎల్ సీజన్ లో సాల్ట్, సుయాశ్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడగా.. ఆ సీజన్ లో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. 

Also Read : ఒక్కడికే నాలుగు అవార్డ్స్.. గుజరాత్ ఓపెనర్‪కు రూ.40 లక్షలు

సాల్ట్ ధనాధన్ బ్యాటింగ్:
 
ఈ సీజన్ లో సాల్ట్ ఓపెనర్ గా ఆర్సీబీ జట్టుకు శుభారంభాలను అందించాడు. ముఖ్యంగా ఫైనల్ కు ముందు జరిగిన చివరి మూడు మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసి దుమ్ములేపాడు. ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ అందించే మెరుపు ఆరంభాలు ఆర్సీబీ జట్టులో కీలక పాత్ర పోషించాయి. ఫైనల్లో 16 పరుగులు చేసి ఔటైనా.. బౌండరీ దగ్గర ఒక స్టన్నింగ్ క్యాచ్ అందుకొని తమ జట్టుకు తొలి వికెట్ అందించాడు. ఈ సీజన్ లో సాల్ట్ ఇప్పటివరకు 175 స్ట్రైక్ రేట్ తో 403 పరుగులు చేశాడు. సాల్ట్ భార్య ప్రసవించడంతో అతను తన బిడ్డను చూసుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఆ తర్వాత ఐపీఎల్ ఫైనల్ కోసం వెంటనే ఇండియాకు రిటర్న్ అవ్వడం విశేషం. ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రూ. 11.5 కోట్ల రూపాయలకు జట్టులోకి వచ్చి పూర్తి న్యాయం చేశాడు.    

ఆర్సీబీ ఋణం తీర్చుకున్న సుయాశ్ శర్మ 
  
లెగ్ స్పిన్నర్ సుయాష్ శర్మ అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఐపీఎల్ లో అద్భుతంగా రాణించాడు.  గురువారం (మే 29) పంజాబ్ తో జరుగుతున్న క్వాలిఫయర్ 1లో మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచాడు.  పవర్ ప్లే లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్సీబీని కోలుకోనీకుండా చేశాడు. మూడు వికెట్లు తీసి పంజాబ్ ను తక్కువ స్కోర్ కే పరిమితమయ్యేలా చేశాడు. ఓవరాల్ గా ఈ సీజన్ లో 14 మ్యాచ్ ల్లో 8 వికెట్లు తీసి ఆర్సీబీ టైటిల్ గెలవడంతో తన వంతు పాత్ర పోషించాడు. రూ. 2.60 కోట్లకు సుయాష్ శర్మ ఆర్సీబీ జట్టులోకి వచ్చాడు.