IPL 2025: ఒక్కడికే నాలుగు అవార్డ్స్.. గుజరాత్ ఓపెనర్‪కు రూ.40 లక్షలు

IPL 2025: ఒక్కడికే నాలుగు అవార్డ్స్.. గుజరాత్ ఓపెనర్‪కు రూ.40 లక్షలు

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఐపీఎల్ 2025 లో అవార్డ్స్ తో దుమ్ములేపాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అవార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్ లో తన అసాధారణ నిలకడంతో బ్యాటింగ్ లో పరుగుల వరద పారించాడు. ఐపీఎల్ 2025 లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సాయి సుదర్శన్ గా నిలిచాడు. ఈ సీజన్ లో 15 మ్యాచ్ ల్లో 759 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. సుదర్శన్ యావరేజ్ 54 ఉండగా 150 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. సుదర్శన్ గెలుచుకున్న అవార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్ విజేత:

ఐపీఎల్ 2025 లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ గా నిలిచాడు. ఈ సీజన్ లో 15 మ్యాచ్ ల్లో 759 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఇందుకు గాను సుదర్శన్ కు రూ. 10 లక్షల రూపాయాలు లభించాయి. దీనితో ఫ్యాన్తసి కింగ్ అవార్డ్.. ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు.. అత్యధిక ఫోర్లు (88) బాదిన ప్లేయర్ గా మరో మూడు అవార్డులు గెలుచుకున్నాడు. ఈ సీజన్ లో ఒక ప్లేయర్ కు ఇన్ని అవార్డ్స్ రావడం సాయి సుదర్శన్ కే సాధ్యమైంది. ఒక్కొక్క అవార్డుకు రూ. 10 లక్షల చొప్పున ఓవరాల్ గా నాలుగు అవార్డ్స్ కు రూ.40 లక్షలు గెలుచుకోవడం విశేషం. 

Also Read : సూర్యకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్.. ఐపీఎల్ 2025 అవార్డ్స్ లిస్ట్ ఇదే!

సాయి సుదర్శన్ ఐపీఎల్ లో చూపించిన అద్భుతమైన నిలకడకు భారత టెస్ట్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేసిన 18 మంది ప్రాబబుల్స్ లో స్థానం దక్కింది. రిపోర్ట్స్ ప్రకారం సుదర్శన్ కు టెస్ట్ సిరీస్ లో తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇంగ్లాండ్ గడ్డపై సర్రే తరఫున ఆడడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. రెండు కౌంటీ సీజన్లలో ఆడిన సుదర్శన్ బ్రిటిష్ పరిస్థితులకు అలవాటు పడి.. ఇంగ్లాండ్ పిచ్ లపై ఉపయోగపడతాడని భారత జట్టు భావిస్తున్నట్టు సమాచారం.